4, నవంబర్ 2013, సోమవారం

మనీ మార్కెట్ స్ట్రాటజీ

మార్కెట్ ను గురించి వివరిస్తూ రైతే మార్కెట్ అనలిస్ట్ అని ఒక పోస్ట్ చేసాను .

ఎందుకంటే చాలామంది మార్కెట్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేసి నష్ట పోతున్నారు . ఉన్న స్థిర చరాస్తులు కూడా అమ్ముకొని రోడ్డున పడుతున్నారు . దీనికంతటికి కారణం ఏమిటి అని ఆలోచించి నపుడు నాకు ఈ ఐడియా వచ్చింది . మార్కెట్ పై అవగాహన లేకపోవడం , దురాశ , తొందరగా డబ్బును సంపాదించి గొప్ప వాళ్ళం అయి పోవాలనే ఆశ తో ఉన్నది కూడా పోగొట్టుకొని బికారులు గా మారుచున్నారు.

అందుకనే రైతునే ఆదర్శంగా తీసుకోవాలని ఉదహరించడం జరిగింది .
ఎందుకంటే రైతు భూమిలో పంటను వెయ్యాలని అనికొని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా విత్తనాలు వేయడు . అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తాడు . పంటకు అనుకూల వాతావరణం ఏర్పడినపుడు తను వెయ్యదలచుకొన్న విత్తనములు మొలకెత్తే విధంగా భూమిని సాగుచేసి అనుకూలంగా మార్చు కొంటాడు . పిమ్మట జాగ్రత్తగా విత్తనములు వేసి పంట పక్వమునకు వచ్చే వరకు వేచి ఉంటాడు . పది పదిహేను సంవత్సరములలో ఎప్పుడో ఒకసారి తుఫానులో , వరదలో , లేక అతివృష్టి , అనావృష్టి చేతనో నష్టపోతాడు తప్ప మిగిలిన అన్ని సంవత్సరములలోనూ ఎంతోకొంత తను పెట్టుబడి పోనూ లాభం తింటాడు . అయితే ఇలా ఎందుకు అంటున్నాను అంటే ప్రతి సంవత్సరము దిగుబడి ఒకేలా ఉండదు . ఒక్కొక్క సారి ఎక్కువగా , మరొక్కసారి తక్కువగా దిగుబడి వస్తుంది కదా.

ఇక్కడ భూమి ఎక్కడికి పోదు . వేసే పంటలే మారతాయి .
అలాగే మార్కెట్ అనే భూమిలో రూపాయి అనే విత్తులు నాటండి . రైతు భూమిని సాగుచేసే పద్దతిలో జాగ్రత్తగా మార్కెట్ని షేర్స్ ని అనాలసిస్ చేసి సరియైన కంపెనీలో పెట్టుబడి పెట్టగలిగితే మనం పెట్టిన పెట్టుబడికి  మంచి ప్రతి ఫలాన్ని పొందవచ్చు . ట్రేడింగ్ మాత్రం ప్రమాద కరము . సరియైన వ్యూహం ప్రకారం ముందుకు వెళితే లాభాలే లాభాలు .. వ్యూహం లేకుండా ముందుకు వెళ్ళకండి . మునిగిపోతారు . మార్కెట్ ఎక్కడికి పోదు .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి