17, డిసెంబర్ 2014, బుధవారం

ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ లాభాలు

లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయ గలిగితే అసాధారణ లాభాలను పొంద వచ్చు .
మనకు అందరకు తెలిసిన విప్రో కంపెనీ గురించి తెలుసు కొందాం ? ఈ కంపెనీ యొక్క సమాచారము ఒక్కొక్క దగ్గర ఒక్కో విధముగా ఉన్నది . అందుచేత ముందు ఇచ్చిన పోస్టులో మార్పులు చేయడం జరిగింది .
ఇక ఇన్ఫోసిస్ కంపెనీ గురుంచి తెలుసు కొందాం.

ఈ కంపెనీ 1993 ఫిబ్రవరి లో పబ్లిక్ ఇష్యూ కి వచ్చింది .
ఇష్యూ రేటు 98 రూపాయలు . పది రూపాయలు పేస్ వాల్యూ
10000  రూపాయలు ఇన్ఫోసిస్ లో పెట్టుబడి పెడితే లాభం ఎంత వచ్చిందో తెలుసు కొందాం.

10000 రూపాయలు పెట్టుబడి తో కొన్న షేర్లు 10000/98 = 102
1994       1:1 bonus           = 204 shares
1997       1:1  bonus           =  408 shares
1999       1: 1 bonus           =  816 shares
2000face value 10/2 split= 1632 shares
2004       3:1 bonus            =   4896 shares
2006       1:1 bonus            =   9784 shares

2013 సంవత్సరములో వీటి విలువ ఎంత లెక్క వేద్దాం >
9784*3275 = 3,20,42,600 /-
అక్షరాలా మూడు కోట్ల ఇరవై లక్షల నలబై రెండు వేల ఆరు వందల రూపాయలు.
అదే ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి వచ్చే మొత్తం 32,04,260.
ఇంకా డివిడెండ్ లెక్క కట్టలేదు .  
               


27, సెప్టెంబర్ 2014, శనివారం

AUTOMOBILE

ఆటో మొబైల్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం వలన అనేక లాభాలను పొందవచ్చు .
మార్కెట్లో ఈ మధ్య కాలములో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది . అల్పాదాయ , మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కూడా ఈనాడు వాహనమును వాడు చున్నారు .
క్రమేణా సైకిల్ వాడకం కన్నా TWO WHEELER , THREE WHEELER AND FOUR WHEELER మొదలగు వాహనముల వాడకం విపరీతంగా పెరుగుతుంది . వాహనము అనేది మనిషి నిత్య జీవితములో ఒక భాగమై పోయింది .

అయితే సాధారణముగా ఆటో మొబైల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి.  M&M , MARUTI SUZIKI  , HORO MOTOCORP, TVS MOTORS, TATA MOTORS  మొదలగు కంపెనీలు గుర్తుకు వస్తాయి . ఈ మధ్య కాలములో పైన తెలిపిన కంపెనీలు షేర్స్ బాగా పెరిగాయి . ఆటో మొబైల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టవచ్చు . మరియు వాటికి సంభందించిన SPARE PARTS , AUTO MOBILE PARTS , TYRES AND ETC…. మొదలగు వాటిలో పెట్టుబడి పెట్టడము వలన అంతకన్నా ఎక్కువ లాభాలను గడించవచ్చు .

EX : JK TYRES , MRF , APOLLO TYRES మొదలగు కంపెనీలు . ఈ మధ్య కాలములో పై కంపెనీలు అయిదారు రెట్లు పెరిగి పోయాయి . భవిష్యత్తులో కూడా ఈ షేర్స్ కు డిమాండ్ ఉంటుంది .
కాబట్టి అనుకూలమైన రేట్లకు దొరికినప్పుడు వీటిలో పెట్టుబడి పెట్టడం వలన మంచి లాభాలను పొందవచ్చు .


సిరులు కురిపించిన ఫార్మా రంగం

2008 సంవత్సరము తరువాత ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఫార్మా కంపెనీలలో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన లాభాలను అందించిన కంపెనీలను గురించి సాక్షి పేపర్లో
మదుపర్లకు తీపి మాత్ర అనే హెడ్డింగ్ తో చక్కని వ్యాసం వచ్చింది .

మదుపర్లకు తీపి‘మాత్ర’!
రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు  ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది.