27, సెప్టెంబర్ 2014, శనివారం

సిరులు కురిపించిన ఫార్మా రంగం

2008 సంవత్సరము తరువాత ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఫార్మా కంపెనీలలో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన లాభాలను అందించిన కంపెనీలను గురించి సాక్షి పేపర్లో
మదుపర్లకు తీపి మాత్ర అనే హెడ్డింగ్ తో చక్కని వ్యాసం వచ్చింది .

మదుపర్లకు తీపి‘మాత్ర’!
రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు  ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది. 

1 కామెంట్‌: