5, నవంబర్ 2013, మంగళవారం

ఆపరేటర్ మాయాజాలము .

మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టే సమయములో చాలా అప్రమత్తంగా ఉండండి . 

మార్కెట్ లో ఉన్న కొన్ని కంపెనీల షేర్స్ లో ఆపరేటర్ మాయాజాలము ఉంటుంది . స్తబ్దుగా ఉన్న షేర్స్ ఏ విధమైన ఫండమెంటల్ లేని షేర్స్ కూడా అతి కొద్ది కాలము లో రెండు రెట్లు మూడు నాలుగు రెట్లు పెరిగి పోతుంది . అది చూసి అరే ఈ షేరు నెల రోజుల్లోనే ఇంత  పెరిగి పోయింది . మనం కొనలేక పోయాము . ఇంకా పెరిగి పోతుందేమో అని ఆశతో వాటిని కొంటాం . ఇలా అందరి దృష్టి పడే వరుకు ఆపరేటర్లు  ఆకాశానికి తీసుకొని వెళతారు . అదను చూసి తమ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేస్తుంటారు . అంతే ఎంత స్పీడుగా వెళ్లిందో అంతకన్నా డబుల్ స్పీడుతో షేర్ పడి పోతుంది . దీనివలన ఉన్న షేర్స్ ఏదో ఒక రేటుకి అమ్మేద్దామని డిసైడ్ అయిపోతాం . తీరా చూస్తే ఆ షేర్ ప్రతి రోజు లోవర్ సర్క్యూట్ ని టచ్ చేస్తూనే ఉంటుంది .

షేర్ అతి వేగంగా పెరుగుతుంది అంటే దానిలో ఏదో మతలబు ఉంది అని అర్ధం చేసుకోండి . ఆ కంపెనీ గురించి , ఉత్పత్తి చేసే వస్తువులు , మార్కెట్ డిమాండ్,  బాలన్స్ షీట్స్ , మొదలగు విషయములు క్షుణ్ణంగా పరిశీలించాలి . అన్ని విధాలుగా పరిశీలించిన తరువాత నమ్మకము కలిగితే అప్పుడు పెట్టుబడి పెట్టండి . అంతే కానీ తొందర పాటుగా వ్యవహరించడం వలన ఉన్నది వూడ్చుకు పోతుంది .    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి