4, నవంబర్ 2013, సోమవారం

రైతే మార్కెట్ అనలిస్ట్

ఇప్పుడు చెప్పబోయే విషయము అందరికి తెలిసినదే అయినా దీనిలో మార్కెట్ స్టాటజీ దాగి ఉంది .
మనం మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం  తీసుకోవలసిన అవసరం ఉంది .

ఉదా ; ఒక రైతుని ఆదర్శం గా తీసుకోవాలి .
వాణిజ్య పంటలు మినహాయించి మిగతా వాటి గురించి తెలుసు కొందాం .
రైతు పండించే పంటలలో 1 . తాత్కాలిక దృక్పధం తో పండించే పంటలు ,
2 . దీర్ఘకాలిక దృక్పధం తో పండించే పంటలు కూడా ఉంటాయి .
1 . తాత్కాలిక దృక్పధం తో పండించే పంటలు వరి , వేరుశనగ , పప్పు దినుసులు, మిరప , పత్తి పంటలు మొదలగునవి . 

దీనికి తెగుళ్ళు ఎక్కువ , తుఫానులు , వరదలు సంభవించినా , లేక నీటి ఎద్దడి ఏర్పడినా పండిన పంట చేతికి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవడం కూడా జరుగుతుంది .   
2 . దీర్ఘకాల దృక్పధం తో పండించే పంటలు టేకు తోట , జీడి , మామిడి మొదలగుగా గల పంటలు . వీటిలో నష్టపోవడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది . అంతేకాక వీటి వలన వచ్చే ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది .

మొదట వ్యవసాయము చెయ్యాలని అనుకొన్నప్పుడు తను వెయ్యలను కొనే పంటకు అనుకూలమైన వాతావరణము వచ్చే వరకు వేచి ఉంటాడు . వ్యవసాయము చేసేటప్పుడు రైతు భూమిని దున్ని సాగుచేసి విత్తనాలు వేయుటకు అనువుగా భూమిని తయారు చేస్తాడు . రైతు నమ్మకముతో వ్యవసాయం చేస్తాడు తను పెట్టిన పెట్టుబడికి , పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందనే ఆశతో వ్యవసాయం చేస్తాడు . అయినా గానీ అన్ని సందర్భాలలో లాభాన్ని పొందలేడు . ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు , అనుకోని కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మాత్రమే నష్టాలను ఎదుర్కొంటాడు . మిగతా సమయాలలో తను పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతి ఫలాన్ని పొందడం జరుగుతుంది .

అలాగే మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు కూడా  మొదట ఏ ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలని అనుకొంటారో ఆ రంగ మునకు సంబంధించి ( అనాలసిస్ )మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది . మనం ఎంచు కొన్న రంగమునకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉందా ? రాబోయే రోజులలో ఈ రంగమునకు సంబంధించి డిమాండ్ ఎలా ఉంటుంది .అనే అంశాలపై స్టడీ చెయ్యాలి . ఇలా స్టడీ చేసిన తరువాత ఈ రంగమునకు సంబంధించిన కంపెనీలు ఎన్ని ? ఏ ఏ కంపెనీలు ఈ రంగములో మంచి ఫలితములు అందిస్తున్నాయి గత పది సంవత్సరములో ఆ కంపెనీల పెర్పార్మేన్స్ ఎలా ఉంది . ఈ కంపెనీలో మనం పెట్టుబడి పెడితే తగిన ప్రతి ఫలం వస్తుందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి.

రెండవ విషయము .
మనం పెట్టే పెట్టుబడి ఎంతకాలం మార్కెట్ లో ఉంచగలము . ప్రస్తుతానికి మనకున్న అవసరాలేమిటి . ఎంత కాలం మార్కెట్ లో కొనసాగించగలము అనే విషయములు కూడా బేరీజు వేసుకొని పెట్టుబడిని పెట్టడం మంచిదని నా అభిప్రాయము .
రైతు వలే ప్రణాలికా బద్దంగా వ్యవహరిస్తే మార్కెట్లో వచ్చే వడ్డీ కన్నా ఎక్కువ లాభాన్ని అందుకోవచ్చు .
ఈ స్టాటజీ లో నష్ట భయం చాలా తక్కువగా ఉంటుంది . 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి