29, అక్టోబర్ 2013, మంగళవారం

షేర్స్ పెట్టుబడి

మనం పోస్టాఫీసులో గానీ లేక బ్యాంకులో గానీ డబ్బును డిపాజిట్ చేసినపుడు  TERM ఉంటుంది .

EX: KISAN VIKASH PATRA దీనికి  8 YEARS 7 MONTHS లో DOUBLE ఇచ్చేవారు . ప్రస్తుతానికి ఈ స్కీము అందుబాటులో లేదు .అలాగే  5 YEARS& 10 YEARS  NATIONAL SAVING BONDS , AND TIME DEPOSIT SCHEEMS అలాగే బ్యాంక్ FIXED DEPOSITS  వీటన్నింటిలో కొంత టైం ఉంటుంది .

ప్రస్తుతమున్న INTEREST RATES 8% TO 9.5% మధ్య ఉంటున్నాయి . ఈ లెక్కన మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలని అనికొంటే సుమారు 8 నుండి 9సంవత్సరాలు పడుతుంది . అదే AMOUNT  SHARES లో పెట్టుబడి పెడితే మరింత ఎక్కువ లాభాని గడించ వచ్చు . అంతే  కాకుండా వచ్చిన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది .

షేర్స్ లో పెట్టుబడి పెట్టేముందు కొంత ప్రాధమిక అవగాహన ఉండాలి . షేర్స్ లో పెట్టుబడి పెట్టేవారు MINIMUM 10 YEARS పెట్టుబడిని కొనసాగించాలి .

మనం కొనదల్చుకొన్న కంపెనీ యొక్క షేర్స్ పై కొంత RESEARCH  చెయ్యాలి . ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ ఏమిటి ? ఆ ప్రోడక్ట్ కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత ? భవిష్యత్తులో వారు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంటుంది ? గడచిన  పది సంవత్సరాలలో ఆ కంపెనీ పరిస్థితి ఏ విధముగా ఉన్నది . ఆ కంపెనీ లో ఉన్న పెట్టుబడి దారులు , ప్రమోటర్స్ వాటా ఎంత ? ఆస్తులు , అప్పుల చిట్టా మొదలగు విషయములు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడి పెట్టాలి .

ఆ కంపెనీ ప్రతి సంవత్సరం DIVIDEND ఇస్తుందా? బోనస్ ప్రకటించిందా? ఇలాంటివన్నీ క్షుణ్ణముగా పరిశీలించి మదుపు చేయడం వలన ఎక్కువగా లాభపడటానికి అవకాశములు ఉన్నాయి .
మార్కెట్లో ఎప్పుడూ తొందరపాటు పడకూడదు . అన్నింటికీ మించి ఓపిక సహనము అవసరము . మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు .క్రిందకు , మీదకు కదులుతూనే ఉంటుంది .

మనం చేయవలసినది ఒక్కటే . షేర్ పడ్డప్పుడు కొనడం పెరిగినపుడు అమ్మడం .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి