29, అక్టోబర్ 2013, మంగళవారం

పెట్టుబడి మార్గాలు

చాలా మంది  షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి  ఈ మధ్య కాలములో శ్రద్ధ చూపిస్తున్నారు .

ప్రతి మనిషికి  డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది . తాను  సంపాదించిన  డబ్బులో నిత్యావసరాలకు ఖర్చులు పోను ఎంతో కొంత డబ్బును భవిష్యత్తు అవసరాల కొరకు పొదుపును పాటించడం అనే అలవాటు ప్రతి ఒక్కరికి అవసరము . అయితే  తను మిగుల్చుకొన్న  డబ్బును చాలా ప్రణాలికా బద్దంగా దీర్గాకాల దృష్టితో పొదుపు చేయడం వలన  RISK చాలా తక్కువగా ఉంటుంది .


నిత్య అవసరాలకు పోనూ మిగిలే డబ్బును పొదుపు చేయడం లో PORTFOLIO MAINTAIN చేయడం ఎప్పటికి మర్చిపోకూడదు .
PORTFOLIO ఎలా ఉండాలి అని అంటే

మన దగ్గర ఒక 100౦  రూపాయలు ఉందని అనుకొందాం .
దీనిని నాలుగు భాగాలుగా విభజించాలి .
1 GOLD. 2 INSURENCE. 3 SAVING BANK .4 SHARES.

 1. GOLD చిన్న చిన్న మొత్తాలతో బంగారము కొనలేక పోవచ్చు .
ఈ మధ్యకాలములో ప్రతి నెల కొంత మొత్తం చొప్పున బంగారములో పెట్టుబడి పెట్టడానికి వీలుగా GOLD FUNDS  మార్కెట్లో ప్రవేశ పెట్టడం జరిగింది . ఉదా : RELIANCE GOLD, IDBI GOLD , KOTAK GOLD  లాంటి స్కీములు . ఈ స్కీములలో ఒక క్రమ పద్దతిలో ప్రతి నెలా కొంత మొత్తమును పెట్టుబడి పెడుతూ మనకు అవసరమున్నప్పుడు మార్కెట్లో PHISICAL GOLD కొనుక్కోవచ్చు . దీనివలన తరుగు , మజూరి చార్జీలు ఉండవు .

2 ఇన్సూరెన్స్  కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసాను కలిగించుటకు ప్రతిఒక్కరు తప్పని సరిగా LIC POLACY తీసుకోవడం మర్చి పోకూడదు . సగటున సంవత్సర ఆదాయానికి 15 రెట్లు పాలసీ తీసుకోవాలి . కుటుంబములో సంపాదించే వ్యక్తికి ఆకస్మికముగా ఏదైనా జరిగితే ఆపదలో ఆడుకొనే నేస్తం INSURENCE POLACY. 

3 SAVIN BANK & FIXED DEPOSITS అత్యవసర సమయాలలో నగదు అవసరాలు తీర్చడం కొరకు పిల్లల చదువులు , పెళ్ళిళ్ళు  మరియు ఇల్లు పెళ్ళిళ్ళు మొదలగు శుభకార్యముల కొరకు ఉపయోగ పడే విధముగా ప్రణాలికా బద్దంగా పొదుపును పాటించడం

4 షేర్స్  : షేర్స్ లో పెట్టుబడి అనగానే ప్రతి ఒక్కరు తొందరపాటుగా వ్యవహరించడం జరుగుతుంది . అదే విధముగా చాలా మంది నష్ట పోవడము కూడా జరుగుతుంది . నాకు తెలిసినంత  మటుకు 100 కి 90 మంది  నష్ట పోతున్నారు .  దీనికి కారణం మార్కెట్ పై అవగాహన లేకపోవడమే .

షేర్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాలం కొనసాగించే విధంగా పెట్టుబడి పెట్టాలి. LONG TERM INVESTMENT లో లాస్ పోవడం అనేది ఉండదు . 
   
తొందరగా డబ్బు సంపాదించాలని ఆశ పడతారు . కానీ ఏ విధమైనా ప్రణాలికా లేకుండా కంటికి  కనపడిన షేర్స్  కొనడం వలన నష్టపోవడం కూడా జరుగుతుంది . దీనికంతటికి కారణం  దురాశ. ముఖ్యముగా   ఈ మార్కెట్లో  ఎక్కువగా పుకార్లు వస్తుంటాయి . వాటిని నమ్మి తొందరపాటుతో  వ్యవహరించడం వలన లాభం  మాటేమో  గానీ ఉన్నది  ఊడ్చుకు పోవడం కాయం .

గమనిక : రిస్క్  ఎక్కడ ఉంటుందో  అక్కడే లాభం ఉంటుంది .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి