17, డిసెంబర్ 2014, బుధవారం

ఇన్ఫోసిస్ లాంగ్ టర్మ్ లాభాలు

లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయ గలిగితే అసాధారణ లాభాలను పొంద వచ్చు .
మనకు అందరకు తెలిసిన విప్రో కంపెనీ గురించి తెలుసు కొందాం ? ఈ కంపెనీ యొక్క సమాచారము ఒక్కొక్క దగ్గర ఒక్కో విధముగా ఉన్నది . అందుచేత ముందు ఇచ్చిన పోస్టులో మార్పులు చేయడం జరిగింది .
ఇక ఇన్ఫోసిస్ కంపెనీ గురుంచి తెలుసు కొందాం.

ఈ కంపెనీ 1993 ఫిబ్రవరి లో పబ్లిక్ ఇష్యూ కి వచ్చింది .
ఇష్యూ రేటు 98 రూపాయలు . పది రూపాయలు పేస్ వాల్యూ
10000  రూపాయలు ఇన్ఫోసిస్ లో పెట్టుబడి పెడితే లాభం ఎంత వచ్చిందో తెలుసు కొందాం.

10000 రూపాయలు పెట్టుబడి తో కొన్న షేర్లు 10000/98 = 102
1994       1:1 bonus           = 204 shares
1997       1:1  bonus           =  408 shares
1999       1: 1 bonus           =  816 shares
2000face value 10/2 split= 1632 shares
2004       3:1 bonus            =   4896 shares
2006       1:1 bonus            =   9784 shares

2013 సంవత్సరములో వీటి విలువ ఎంత లెక్క వేద్దాం >
9784*3275 = 3,20,42,600 /-
అక్షరాలా మూడు కోట్ల ఇరవై లక్షల నలబై రెండు వేల ఆరు వందల రూపాయలు.
అదే ఒక వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి వచ్చే మొత్తం 32,04,260.
ఇంకా డివిడెండ్ లెక్క కట్టలేదు .  
               


27, సెప్టెంబర్ 2014, శనివారం

AUTOMOBILE

ఆటో మొబైల్ పరిశ్రమలో పెట్టుబడి పెట్టడం వలన అనేక లాభాలను పొందవచ్చు .
మార్కెట్లో ఈ మధ్య కాలములో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది . అల్పాదాయ , మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కూడా ఈనాడు వాహనమును వాడు చున్నారు .
క్రమేణా సైకిల్ వాడకం కన్నా TWO WHEELER , THREE WHEELER AND FOUR WHEELER మొదలగు వాహనముల వాడకం విపరీతంగా పెరుగుతుంది . వాహనము అనేది మనిషి నిత్య జీవితములో ఒక భాగమై పోయింది .

అయితే సాధారణముగా ఆటో మొబైల్ అనగానే మనకు గుర్తుకు వచ్చేవి.  M&M , MARUTI SUZIKI  , HORO MOTOCORP, TVS MOTORS, TATA MOTORS  మొదలగు కంపెనీలు గుర్తుకు వస్తాయి . ఈ మధ్య కాలములో పైన తెలిపిన కంపెనీలు షేర్స్ బాగా పెరిగాయి . ఆటో మొబైల్ కంపెనీలలో పెట్టుబడి పెట్టవచ్చు . మరియు వాటికి సంభందించిన SPARE PARTS , AUTO MOBILE PARTS , TYRES AND ETC…. మొదలగు వాటిలో పెట్టుబడి పెట్టడము వలన అంతకన్నా ఎక్కువ లాభాలను గడించవచ్చు .

EX : JK TYRES , MRF , APOLLO TYRES మొదలగు కంపెనీలు . ఈ మధ్య కాలములో పై కంపెనీలు అయిదారు రెట్లు పెరిగి పోయాయి . భవిష్యత్తులో కూడా ఈ షేర్స్ కు డిమాండ్ ఉంటుంది .
కాబట్టి అనుకూలమైన రేట్లకు దొరికినప్పుడు వీటిలో పెట్టుబడి పెట్టడం వలన మంచి లాభాలను పొందవచ్చు .


సిరులు కురిపించిన ఫార్మా రంగం

2008 సంవత్సరము తరువాత ఆంద్ర ప్రదేశ్ కు చెందిన ఫార్మా కంపెనీలలో పెట్టుబడి పెట్టిన వారికి అద్భుతమైన లాభాలను అందించిన కంపెనీలను గురించి సాక్షి పేపర్లో
మదుపర్లకు తీపి మాత్ర అనే హెడ్డింగ్ తో చక్కని వ్యాసం వచ్చింది .

మదుపర్లకు తీపి‘మాత్ర’!
రాష్ట్రానికి చెందిన ఫార్మా షేర్లు ఇన్వెస్టర్లకు సిరుల వర్షం కురిపించాయి. గడచిన నాలుగేళ్ళలో స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకు గురైనప్పటికీ రాష్ట్రానికి చెందిన దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు ఇండెక్స్‌లను మించి లాభాలను అందించాయి. ఈ సమయంలో కొన్ని కంపెనీల షేర్లు 12 నుంచి 19 రెట్లకు పైగా పెరిగాయి. అత్యధిక లాభాలను అందించిన షేర్లలో నాట్కో ఫార్మా అన్నిటికన్నా ముందుంది. 2008లో రూ.38 కనిష్ట స్థాయి నుంచి ఆగకుండా పెరుగుతూ ఇప్పుడు రూ.774 వద్ద ట్రేడ్ అవుతోంది. అంటే కనిష్ట స్థాయి నుంచి ఈ షేరు 19.36 రెట్లు పెరిగింది. ఆ తర్వాత అరబిందో ఫార్మా 12.43 రెట్లు, సువెన్ లైఫ్ 6.76 రెట్లు, డాక్టర్ రెడ్డీస్ 5.79 రెట్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 2008 గరిష్ట స్థాయి వద్ద కదులుతుంటే రాష్ట్రానికి చెందిన ఫార్మా కంపెనీల షేర్లు 2008 స్థాయికి అందనంత ఎత్తులో ట్రేడవుతున్నాయి. ఉదాహరణకు 2008లో మార్కెట్ పతనం కాకముందు రూ.700 (1:1 బోనస్ తర్వాత)గా ఉన్న డాక్టర్ రెడ్డీస్ షేరు  ఇప్పుడు రూ.2,500 స్థాయికి చేరింది. 

స్టాక్ మార్కెట్ స్కామ్స్

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు అనేవి లాభ పడటానికి ఎంత అవకాశం ఉందొ నష్ట పోవడానికి కూడా అంతే అవకాశం ఉంది . దీర్ఘకాలం పాటు పెట్టుబడిని కొనసాగించడం , మార్కెట్లో పెట్టుబడి పెట్టిన సొమ్ము కు నష్టం ఏర్పడినా తట్టుకొనే సామర్ధ్యము ను దృష్టిలో పెట్టుకోవాలి . మార్కెట్ నిరంతరం ఒడిదుడుకులకు లోనవుతుంది .అంతే కాక మార్కెట్లో కొంతమంది స్కాములకు పాల్పడే అవకాశము కూడా ఉంటుంది .

దీని గురించి తెలుసు కోవాలంటే ఈ దిగువ లింకును క్లిక్ చెయ్యండి . మరింత తెలుసు కొండి .

స్కాములు జరిగిన సమయములో పెట్టుబడి ఏ విధంగా  హరించుకు పోయిందో ఒక మిత్రుని అనుభవాన్ని గురించి ఈ వ్యాసంలో వివరించారు
money market scams

31, మార్చి 2014, సోమవారం

INVESTMENTS

Long Term Investors is  Best Results in Money market .

The Investment  Strategy   is different types 

1 st the investor select best companies .

your money divide 4 types of shares . ( 4 sectors )

softwares, banking , medical, realestate , fmcg ,  oil and gas and etc ........

ever amount divided into three types of shares 

large cap industries,
 mid cap industry and 
small cap industries   .

24, నవంబర్ 2013, ఆదివారం

మలి విడత పబ్లిక్ ఇష్యూ పవర్ గ్రిడ్

ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఈ మధ్య కాలములో మలి విడత పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశములు ఉన్నవి .
ప్రస్తుత కాలములో పవర్ లేకపోతే చాలా కష్టం . రాబోయే రోజులలో పవర్ సెక్టార్ కు మంచి భవిష్యత్ ఉంటుందనేది ఎనలిస్టుల అభిప్రాయము .

బొగ్గుకు ప్రస్తుత కాలములో విపరీతమైన డిమాండ్ ఉన్నది . ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా ప్రపంచములోనే బొగ్గు సరఫరా లో రెండవ స్థానములో ఉన్నది . ఈ కంపెనీలో పెట్టుబడి పెడితే రాబోయే కాలములో మంచి లాభాలను ఇచ్చే అవకాశములు ఉన్నాయి .
ఈ కంపెనీ dividends కూడా ఇస్తుంది .

23, నవంబర్ 2013, శనివారం

పెద్ద కంపెనీలలో పెట్టుబడి

పెద్ద కంపెనీలలో పెట్టుబడి పెట్టి దీర్ఘకాలం పాటు కొనసాగించాలి అనుకొనే వారికి అనువైన పధకమును గురించి ఈ రోజు ఈనాడు వార్తా పత్రికలో వచ్చిన వ్యాసం

 కెనరా రోబెకో లార్జ్ క్యాప్ ఫండ్ 




7, నవంబర్ 2013, గురువారం

మల్టీ బేగర్స్ – సన్ ఫార్మా

ఈ రోజు మనం సన్ ఫార్మా కంపెనీ గురించి తెలుసుకుందాం .
ఈ కంపెనీ 1994 అక్టోబర్ లో పబ్లిక్ ఇష్యూ కి వచ్చినట్లు సమాచారం ఉన్నది . 1995లోఈ కంపెనీ షేరు 200 నుండి 300 రూపాయల మధ్య ట్రేడింగ్ జరిగింది .
10000 రూపాయల  పెట్టుబడితో 250 రూపాయలు చొప్పున 40 షేర్స్ కొంటే వచ్చిన లాభం ఎంతో ఇప్పుడు చూద్దాం .  
ఈ కంపెనీ
2000 సం . లో  2: 1 బోనస్ ప్రకటించింది షేర్స్ సంఖ్య                     = 120
2002 లో  10 రూపాయల ఫేస్ వాల్యూ5 రూపాయలు స్ప్లిట్ చేసారు = 240
2004 సం .లో  1 : 1 బోనస్ ప్రకటించింది షేర్స్ సంఖ్య                = 480
2010 లో 5  రూపాయల ఫేస్ వాల్యూ 1 రూపాయి స్ప్లిట్ చేసారు.= 2400
2013  సం . లో 1 : 1 బోనస్ ప్రకటించింది షేర్స్ సంఖ్య              = 4800
1994లో పదివేలు పెట్టుబడి పెట్టిన వారికి  2013 లో వచ్చిన మొత్తం
4800*600 = 28,80,000/-

ఇంకా కంపెనీ వారు ప్రతి సంవత్సరము ప్రకటించే డివిడెండ్ అదనం .

5, నవంబర్ 2013, మంగళవారం

Multi Baggers

మల్టీ బేగర్స్ అంటే ఒక షేరు అనేక షేర్లు గా రూపాంతరం చెందడం . దీని వలన మనం పెట్టిన పెట్టుబడి అనేక రెట్లు వృద్ది పొందుతుంది . ఎక్కువ లాభాలు పొందగలము .
Tata consultansy servises
 ఈ రోజు టాటా కన్సల్టెన్సీ షేరుని గురించి చూద్దాం .
ఈ కంపెనీ 25 . 08 . 2004 వ తేదీన 1 రూపాయి ఫేస్ వాల్యూ తో  849.00 ప్రీమియం రేటులో పబ్లిక్ ఇష్యూ కి వచ్చింది.
సుమారుగా వెయ్యి రూపాయలు రేటులో ట్రేడింగ్ జరిగింది .
పది వేల రూపాయలు పెట్టుబడి తో 10 షేర్స్ ఆనాడు పెట్టుబడి పెడితే వచ్చే లాభం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోజు మన దగ్గర ఉన్న షేర్స్  10
ఈ కంపెనీ            2006  1 : 1 BONUS    20  shares
                                2009  1 : 1 BONUS    40  shares
2013 లో మన దగ్గర ఉన్న షేర్స్  40
వీటి విలువ లెక్క చేద్దాం .   40 * 2040  = 81600 rs/-
 ఇంకా డివిడెండ్ రూపములో వచ్చిన డబ్బును కూడా లెక్క వేస్తే .
కంపెనీ ప్రకటించిన డివిడెండ్ వివరాలు ఇలా ఉన్నాయి .
సంవత్సరాల వారీగా ప్రకటించిన డివిడెండ్ వివరములు
2005
2006
2007
2008
2009
2010
2011
2012
2013
11.50
13.50
13
14
14
20
14
25
22

సంవత్సరాల వారీ మన దగ్గర ఉన్న షేర్స్ , డివిడెండ్ వివరములు
10
10
20
20
20
40
40
40
40
115
135
260
280
280
800
560
1000
840

డివిడెండ్ రూపములో తీసుకున్న సొమ్ము  4270 + shares value 81600 = 85870.00

చూశారా మల్టీ బేగర్స్  షేర్స్ ఎంత లాభాన్ని ఇచ్చాయో  

ఆపరేటర్ మాయాజాలము .

మార్కెట్లో మీరు పెట్టుబడి పెట్టే సమయములో చాలా అప్రమత్తంగా ఉండండి . 

మార్కెట్ లో ఉన్న కొన్ని కంపెనీల షేర్స్ లో ఆపరేటర్ మాయాజాలము ఉంటుంది . స్తబ్దుగా ఉన్న షేర్స్ ఏ విధమైన ఫండమెంటల్ లేని షేర్స్ కూడా అతి కొద్ది కాలము లో రెండు రెట్లు మూడు నాలుగు రెట్లు పెరిగి పోతుంది . అది చూసి అరే ఈ షేరు నెల రోజుల్లోనే ఇంత  పెరిగి పోయింది . మనం కొనలేక పోయాము . ఇంకా పెరిగి పోతుందేమో అని ఆశతో వాటిని కొంటాం . ఇలా అందరి దృష్టి పడే వరుకు ఆపరేటర్లు  ఆకాశానికి తీసుకొని వెళతారు . అదను చూసి తమ దగ్గర ఉన్న షేర్స్ అమ్మేస్తుంటారు . అంతే ఎంత స్పీడుగా వెళ్లిందో అంతకన్నా డబుల్ స్పీడుతో షేర్ పడి పోతుంది . దీనివలన ఉన్న షేర్స్ ఏదో ఒక రేటుకి అమ్మేద్దామని డిసైడ్ అయిపోతాం . తీరా చూస్తే ఆ షేర్ ప్రతి రోజు లోవర్ సర్క్యూట్ ని టచ్ చేస్తూనే ఉంటుంది .

షేర్ అతి వేగంగా పెరుగుతుంది అంటే దానిలో ఏదో మతలబు ఉంది అని అర్ధం చేసుకోండి . ఆ కంపెనీ గురించి , ఉత్పత్తి చేసే వస్తువులు , మార్కెట్ డిమాండ్,  బాలన్స్ షీట్స్ , మొదలగు విషయములు క్షుణ్ణంగా పరిశీలించాలి . అన్ని విధాలుగా పరిశీలించిన తరువాత నమ్మకము కలిగితే అప్పుడు పెట్టుబడి పెట్టండి . అంతే కానీ తొందర పాటుగా వ్యవహరించడం వలన ఉన్నది వూడ్చుకు పోతుంది .    

4, నవంబర్ 2013, సోమవారం

లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్

లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ మెంట్ చేయ గలిగితే అసాధారణ లాభాలను పొంద వచ్చు .
మనకు అందరకు తెలిసిన విప్రో కంపెనీ గురించి తెలుసు కొందాం ?
1980 సంవత్సరములో  ఈ కంపెనీలో 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే వచ్చిన లాభం ఎంతో తెలుసా ?
1980 లో విప్రో కంపెనీ షేర్ 100 రూపాయలు       
1980 లో ఫేస్ వాల్యూ 100రూపాయలు ఉండేది .  
100 షేర్స్ 100 రూపాయలు చొప్పున కొని ఉంటే ఈ కంపెనీ షేర్ ఎలా పెరిగిందో చూద్దాం .
1980 లో మీదగ్గర ఉన్న షేర్స్ 100 విలువ 10,000rs/-
1981      1: 1 bonus            200
1985       1: 1 bonus           400
1986 split shares 10:1        4000
1987       1: 1 bonus           8000
1989       1 : 1 bonus          16000
1992       1: 1  bonus          32000
1995       1: 1 bonus           64000
1997       2: 1 bonus           192000
1999       5: 1 spilt              960000
2004       2: 1 bonus           2880000
2005       1: 1 bonus           5760000
2010       2 : 3 bonus          9600000

ఆ రోజు పెట్టిన పెట్టుబడి పదివేల రూపాయలు కొన్న షేర్స్ వంద
మరి ఈ నాడు వాటి విలువ ఎంతో తెలుసా ?
9600000* 485 అక్షరాలా 465 కోట్ల 60  లక్షలు

ఇది కాక డివిడెండ్ రూపములో ఎంతో సొమ్ము వచ్చి ఉంటుంది .
అంతెందుకు ఆనాడు పది వేల రూపాయలు పెట్టిన వారికి ఈ నాడు ఉన్న షేర్స్  96 లక్షలు. ప్రతి సంవత్సరము ఐదు రూపాయలు డివిడెండ్ కంపెనీ ప్రకటించిది అని అనుకొంటే మార్కెట్ తో పని లేకుండా ఈ నాడు ప్రతి సంవత్సరము పొందే మొత్తం ఎంతో తెలుసా
9600000*5 =  4 కోట్ల 80 లక్షలు  రూపాయలు
ఈ విధంగా షేర్స్ వలన లాభం ఉంటుంది .     

రైతే మార్కెట్ అనలిస్ట్

ఇప్పుడు చెప్పబోయే విషయము అందరికి తెలిసినదే అయినా దీనిలో మార్కెట్ స్టాటజీ దాగి ఉంది .
మనం మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం  తీసుకోవలసిన అవసరం ఉంది .

ఉదా ; ఒక రైతుని ఆదర్శం గా తీసుకోవాలి .
వాణిజ్య పంటలు మినహాయించి మిగతా వాటి గురించి తెలుసు కొందాం .
రైతు పండించే పంటలలో 1 . తాత్కాలిక దృక్పధం తో పండించే పంటలు ,
2 . దీర్ఘకాలిక దృక్పధం తో పండించే పంటలు కూడా ఉంటాయి .
1 . తాత్కాలిక దృక్పధం తో పండించే పంటలు వరి , వేరుశనగ , పప్పు దినుసులు, మిరప , పత్తి పంటలు మొదలగునవి . 

దీనికి తెగుళ్ళు ఎక్కువ , తుఫానులు , వరదలు సంభవించినా , లేక నీటి ఎద్దడి ఏర్పడినా పండిన పంట చేతికి రాదు. పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోవడం కూడా జరుగుతుంది .   
2 . దీర్ఘకాల దృక్పధం తో పండించే పంటలు టేకు తోట , జీడి , మామిడి మొదలగుగా గల పంటలు . వీటిలో నష్టపోవడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతుంది . అంతేకాక వీటి వలన వచ్చే ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది .

మొదట వ్యవసాయము చెయ్యాలని అనుకొన్నప్పుడు తను వెయ్యలను కొనే పంటకు అనుకూలమైన వాతావరణము వచ్చే వరకు వేచి ఉంటాడు . వ్యవసాయము చేసేటప్పుడు రైతు భూమిని దున్ని సాగుచేసి విత్తనాలు వేయుటకు అనువుగా భూమిని తయారు చేస్తాడు . రైతు నమ్మకముతో వ్యవసాయం చేస్తాడు తను పెట్టిన పెట్టుబడికి , పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుందనే ఆశతో వ్యవసాయం చేస్తాడు . అయినా గానీ అన్ని సందర్భాలలో లాభాన్ని పొందలేడు . ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనప్పుడు , అనుకోని కొన్ని సందర్భాలు ఎదురైనప్పుడు మాత్రమే నష్టాలను ఎదుర్కొంటాడు . మిగతా సమయాలలో తను పెట్టిన పెట్టుబడికి తగిన ప్రతి ఫలాన్ని పొందడం జరుగుతుంది .

అలాగే మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు కూడా  మొదట ఏ ఏ రంగాలలో పెట్టుబడి పెట్టాలని అనుకొంటారో ఆ రంగ మునకు సంబంధించి ( అనాలసిస్ )మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది . మనం ఎంచు కొన్న రంగమునకు భవిష్యత్తు ఆశాజనకంగా ఉందా ? రాబోయే రోజులలో ఈ రంగమునకు సంబంధించి డిమాండ్ ఎలా ఉంటుంది .అనే అంశాలపై స్టడీ చెయ్యాలి . ఇలా స్టడీ చేసిన తరువాత ఈ రంగమునకు సంబంధించిన కంపెనీలు ఎన్ని ? ఏ ఏ కంపెనీలు ఈ రంగములో మంచి ఫలితములు అందిస్తున్నాయి గత పది సంవత్సరములో ఆ కంపెనీల పెర్పార్మేన్స్ ఎలా ఉంది . ఈ కంపెనీలో మనం పెట్టుబడి పెడితే తగిన ప్రతి ఫలం వస్తుందా అని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి.

రెండవ విషయము .
మనం పెట్టే పెట్టుబడి ఎంతకాలం మార్కెట్ లో ఉంచగలము . ప్రస్తుతానికి మనకున్న అవసరాలేమిటి . ఎంత కాలం మార్కెట్ లో కొనసాగించగలము అనే విషయములు కూడా బేరీజు వేసుకొని పెట్టుబడిని పెట్టడం మంచిదని నా అభిప్రాయము .
రైతు వలే ప్రణాలికా బద్దంగా వ్యవహరిస్తే మార్కెట్లో వచ్చే వడ్డీ కన్నా ఎక్కువ లాభాన్ని అందుకోవచ్చు .
ఈ స్టాటజీ లో నష్ట భయం చాలా తక్కువగా ఉంటుంది . 

మనీ మార్కెట్ స్ట్రాటజీ

మార్కెట్ ను గురించి వివరిస్తూ రైతే మార్కెట్ అనలిస్ట్ అని ఒక పోస్ట్ చేసాను .

ఎందుకంటే చాలామంది మార్కెట్లో డబ్బులు పెట్టి ట్రేడింగ్ చేసి నష్ట పోతున్నారు . ఉన్న స్థిర చరాస్తులు కూడా అమ్ముకొని రోడ్డున పడుతున్నారు . దీనికంతటికి కారణం ఏమిటి అని ఆలోచించి నపుడు నాకు ఈ ఐడియా వచ్చింది . మార్కెట్ పై అవగాహన లేకపోవడం , దురాశ , తొందరగా డబ్బును సంపాదించి గొప్ప వాళ్ళం అయి పోవాలనే ఆశ తో ఉన్నది కూడా పోగొట్టుకొని బికారులు గా మారుచున్నారు.

అందుకనే రైతునే ఆదర్శంగా తీసుకోవాలని ఉదహరించడం జరిగింది .
ఎందుకంటే రైతు భూమిలో పంటను వెయ్యాలని అనికొని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా విత్తనాలు వేయడు . అనుకూలమైన వాతావరణం కోసం ఎదురు చూస్తాడు . పంటకు అనుకూల వాతావరణం ఏర్పడినపుడు తను వెయ్యదలచుకొన్న విత్తనములు మొలకెత్తే విధంగా భూమిని సాగుచేసి అనుకూలంగా మార్చు కొంటాడు . పిమ్మట జాగ్రత్తగా విత్తనములు వేసి పంట పక్వమునకు వచ్చే వరకు వేచి ఉంటాడు . పది పదిహేను సంవత్సరములలో ఎప్పుడో ఒకసారి తుఫానులో , వరదలో , లేక అతివృష్టి , అనావృష్టి చేతనో నష్టపోతాడు తప్ప మిగిలిన అన్ని సంవత్సరములలోనూ ఎంతోకొంత తను పెట్టుబడి పోనూ లాభం తింటాడు . అయితే ఇలా ఎందుకు అంటున్నాను అంటే ప్రతి సంవత్సరము దిగుబడి ఒకేలా ఉండదు . ఒక్కొక్క సారి ఎక్కువగా , మరొక్కసారి తక్కువగా దిగుబడి వస్తుంది కదా.

ఇక్కడ భూమి ఎక్కడికి పోదు . వేసే పంటలే మారతాయి .
అలాగే మార్కెట్ అనే భూమిలో రూపాయి అనే విత్తులు నాటండి . రైతు భూమిని సాగుచేసే పద్దతిలో జాగ్రత్తగా మార్కెట్ని షేర్స్ ని అనాలసిస్ చేసి సరియైన కంపెనీలో పెట్టుబడి పెట్టగలిగితే మనం పెట్టిన పెట్టుబడికి  మంచి ప్రతి ఫలాన్ని పొందవచ్చు . ట్రేడింగ్ మాత్రం ప్రమాద కరము . సరియైన వ్యూహం ప్రకారం ముందుకు వెళితే లాభాలే లాభాలు .. వ్యూహం లేకుండా ముందుకు వెళ్ళకండి . మునిగిపోతారు . మార్కెట్ ఎక్కడికి పోదు .


29, అక్టోబర్ 2013, మంగళవారం

షేర్స్ పెట్టుబడి

మనం పోస్టాఫీసులో గానీ లేక బ్యాంకులో గానీ డబ్బును డిపాజిట్ చేసినపుడు  TERM ఉంటుంది .

EX: KISAN VIKASH PATRA దీనికి  8 YEARS 7 MONTHS లో DOUBLE ఇచ్చేవారు . ప్రస్తుతానికి ఈ స్కీము అందుబాటులో లేదు .అలాగే  5 YEARS& 10 YEARS  NATIONAL SAVING BONDS , AND TIME DEPOSIT SCHEEMS అలాగే బ్యాంక్ FIXED DEPOSITS  వీటన్నింటిలో కొంత టైం ఉంటుంది .

ప్రస్తుతమున్న INTEREST RATES 8% TO 9.5% మధ్య ఉంటున్నాయి . ఈ లెక్కన మనం పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవ్వాలని అనికొంటే సుమారు 8 నుండి 9సంవత్సరాలు పడుతుంది . అదే AMOUNT  SHARES లో పెట్టుబడి పెడితే మరింత ఎక్కువ లాభాని గడించ వచ్చు . అంతే  కాకుండా వచ్చిన లాభాలపై పన్ను మినహాయింపు లభిస్తుంది .

షేర్స్ లో పెట్టుబడి పెట్టేముందు కొంత ప్రాధమిక అవగాహన ఉండాలి . షేర్స్ లో పెట్టుబడి పెట్టేవారు MINIMUM 10 YEARS పెట్టుబడిని కొనసాగించాలి .

మనం కొనదల్చుకొన్న కంపెనీ యొక్క షేర్స్ పై కొంత RESEARCH  చెయ్యాలి . ఆ కంపెనీ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్ ఏమిటి ? ఆ ప్రోడక్ట్ కు మార్కెట్లో ఉన్న డిమాండ్ ఎంత ? భవిష్యత్తులో వారు ఉత్పత్తి చేసే వస్తువులకు మార్కెట్లో డిమాండ్ ఎంత ఉంటుంది ? గడచిన  పది సంవత్సరాలలో ఆ కంపెనీ పరిస్థితి ఏ విధముగా ఉన్నది . ఆ కంపెనీ లో ఉన్న పెట్టుబడి దారులు , ప్రమోటర్స్ వాటా ఎంత ? ఆస్తులు , అప్పుల చిట్టా మొదలగు విషయములు అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి పెట్టుబడి పెట్టాలి .

ఆ కంపెనీ ప్రతి సంవత్సరం DIVIDEND ఇస్తుందా? బోనస్ ప్రకటించిందా? ఇలాంటివన్నీ క్షుణ్ణముగా పరిశీలించి మదుపు చేయడం వలన ఎక్కువగా లాభపడటానికి అవకాశములు ఉన్నాయి .
మార్కెట్లో ఎప్పుడూ తొందరపాటు పడకూడదు . అన్నింటికీ మించి ఓపిక సహనము అవసరము . మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు .క్రిందకు , మీదకు కదులుతూనే ఉంటుంది .

మనం చేయవలసినది ఒక్కటే . షేర్ పడ్డప్పుడు కొనడం పెరిగినపుడు అమ్మడం .

పెట్టుబడి మార్గాలు

చాలా మంది  షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడానికి  ఈ మధ్య కాలములో శ్రద్ధ చూపిస్తున్నారు .

ప్రతి మనిషికి  డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది . తాను  సంపాదించిన  డబ్బులో నిత్యావసరాలకు ఖర్చులు పోను ఎంతో కొంత డబ్బును భవిష్యత్తు అవసరాల కొరకు పొదుపును పాటించడం అనే అలవాటు ప్రతి ఒక్కరికి అవసరము . అయితే  తను మిగుల్చుకొన్న  డబ్బును చాలా ప్రణాలికా బద్దంగా దీర్గాకాల దృష్టితో పొదుపు చేయడం వలన  RISK చాలా తక్కువగా ఉంటుంది .


నిత్య అవసరాలకు పోనూ మిగిలే డబ్బును పొదుపు చేయడం లో PORTFOLIO MAINTAIN చేయడం ఎప్పటికి మర్చిపోకూడదు .
PORTFOLIO ఎలా ఉండాలి అని అంటే

మన దగ్గర ఒక 100౦  రూపాయలు ఉందని అనుకొందాం .
దీనిని నాలుగు భాగాలుగా విభజించాలి .
1 GOLD. 2 INSURENCE. 3 SAVING BANK .4 SHARES.

 1. GOLD చిన్న చిన్న మొత్తాలతో బంగారము కొనలేక పోవచ్చు .
ఈ మధ్యకాలములో ప్రతి నెల కొంత మొత్తం చొప్పున బంగారములో పెట్టుబడి పెట్టడానికి వీలుగా GOLD FUNDS  మార్కెట్లో ప్రవేశ పెట్టడం జరిగింది . ఉదా : RELIANCE GOLD, IDBI GOLD , KOTAK GOLD  లాంటి స్కీములు . ఈ స్కీములలో ఒక క్రమ పద్దతిలో ప్రతి నెలా కొంత మొత్తమును పెట్టుబడి పెడుతూ మనకు అవసరమున్నప్పుడు మార్కెట్లో PHISICAL GOLD కొనుక్కోవచ్చు . దీనివలన తరుగు , మజూరి చార్జీలు ఉండవు .

2 ఇన్సూరెన్స్  కుటుంబ సభ్యులకు ఆర్ధిక భరోసాను కలిగించుటకు ప్రతిఒక్కరు తప్పని సరిగా LIC POLACY తీసుకోవడం మర్చి పోకూడదు . సగటున సంవత్సర ఆదాయానికి 15 రెట్లు పాలసీ తీసుకోవాలి . కుటుంబములో సంపాదించే వ్యక్తికి ఆకస్మికముగా ఏదైనా జరిగితే ఆపదలో ఆడుకొనే నేస్తం INSURENCE POLACY. 

3 SAVIN BANK & FIXED DEPOSITS అత్యవసర సమయాలలో నగదు అవసరాలు తీర్చడం కొరకు పిల్లల చదువులు , పెళ్ళిళ్ళు  మరియు ఇల్లు పెళ్ళిళ్ళు మొదలగు శుభకార్యముల కొరకు ఉపయోగ పడే విధముగా ప్రణాలికా బద్దంగా పొదుపును పాటించడం

4 షేర్స్  : షేర్స్ లో పెట్టుబడి అనగానే ప్రతి ఒక్కరు తొందరపాటుగా వ్యవహరించడం జరుగుతుంది . అదే విధముగా చాలా మంది నష్ట పోవడము కూడా జరుగుతుంది . నాకు తెలిసినంత  మటుకు 100 కి 90 మంది  నష్ట పోతున్నారు .  దీనికి కారణం మార్కెట్ పై అవగాహన లేకపోవడమే .

షేర్స్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు దీర్ఘకాలం కొనసాగించే విధంగా పెట్టుబడి పెట్టాలి. LONG TERM INVESTMENT లో లాస్ పోవడం అనేది ఉండదు . 
   
తొందరగా డబ్బు సంపాదించాలని ఆశ పడతారు . కానీ ఏ విధమైనా ప్రణాలికా లేకుండా కంటికి  కనపడిన షేర్స్  కొనడం వలన నష్టపోవడం కూడా జరుగుతుంది . దీనికంతటికి కారణం  దురాశ. ముఖ్యముగా   ఈ మార్కెట్లో  ఎక్కువగా పుకార్లు వస్తుంటాయి . వాటిని నమ్మి తొందరపాటుతో  వ్యవహరించడం వలన లాభం  మాటేమో  గానీ ఉన్నది  ఊడ్చుకు పోవడం కాయం .

గమనిక : రిస్క్  ఎక్కడ ఉంటుందో  అక్కడే లాభం ఉంటుంది .


27, అక్టోబర్ 2013, ఆదివారం

పరిచయం

మనీ మార్కెట్ ఇన్సూరెన్స్ మొదలగు విషయములను గురించి ఈ బ్లాగులో వివరించుట ముఖ్య ఉద్దేశ్యము .

మనీ మార్కెట్ సంబంధిత విషయములను గురించి తెలుగులో సమాచారము లభించుట లేదు . దీనిపై నాకున్న కొద్ది అవగాహనతో పాటు వివిధ పత్రికలూ మేగ్జైన్స్  మరియు ఇతరుల నుండి సేకరించిన సమాచారమును నలుగురకు తెలియపరచాలనే ఉద్దేశ్యముతో  ఈ బ్లాగును ప్రారంభిస్తూ ఉన్నాను . కావున బ్లాగు మిత్రులు  మీయొక్క అమూల్యమైన సలహాలను సూచనలను అందిస్తారని కోరుకుంటున్నాను .



ఇంతకముందు  నేను వ్రాసిన జ్యోతిష్యము http://bhavisyadarsini.blogspot.in/ బ్లాగును ఆదరించినట్లుగా  ఈ బ్లాగును  కూడా  ఆదరిస్తారని మనసారా నమ్ముతున్నాను .